టీడీపీ తరఫున రాజ్యసభకు పోటీ చేస్తున్న భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, సానా సతీష్ లు శాసనసభలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాల దాఖలు చేశారు.
సానా సతీష్ నామినేషన్‌కు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు.
భాష్యం రామకృష్ణ నామినేషన్‌కు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రతిపాదకులు ఉన్నారు. చింతకాయల విజయ్ నామినేషన్‌కు మంత్రి కొలుసు పార్థసారథి, పెదకూరపాడు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్యే విజయ్‌కుమార్, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు.
చింతకాయల విజయ్ నామినేషన్ సందర్భంగా అసెంబ్లీకి హాజరైన ఆయన తండ్రి, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.
నామినేషన్ దాఖలుకు ఇవాళ సాయంత్రం 3 గంటలవరకు గడువు పూర్తి అవుతుంది.
మంగళవారం నామినేషన్ల పరిశీలన చేయనున్నారు.
ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన జనసేన అభ్యర్థి లింగమనేని రమేష్ మాత్రమే అని తెలిపారు. కూటమికి అసెంబ్లీలో ఉన్న 164 మంది సభ్యుల బలం నేపథ్యంలో టీడీపీ అభ్యర్థులు భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, సానా సతీష్‌తో పాటు జనసేన అభ్యర్థి లింగమనేని రమేష్ లు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం
విత్ డ్రా గడువు ముగిసిన అనంతరం అధికారికంగా ప్రకటించనున్న అధికారులు.