NETI SUBHODAYA
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 1:51 pm Posted by : NETI SHUBHODAYA NEWS

జగ్గంపేట పోలీసులు నిర్వహించిన ఫిట్ ఇండియా – ప్రపంచ సైకిల్ దినోత్సవ ర్యాలి

 

కాకినాడ జిల్లా,జగ్గంపేట, జూన్ 07 నేటి శుభోదయ

కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, పెద్దాపురం ఎస్డీపీఓ శ్రీ ఏబీజీ తిలక్ మరియు జగ్గంపేట సీఐ శ్రీ బి. తిరుపతిరావు పర్యవేక్షణలో జగ్గంపేట పోలీసులు “ఫిట్ ఇండియా” మరియు “ప్రపంచ సైకిల్ దినోత్సవం” సందర్భంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎస్సై శ్రీ టి. రఘునాధరావు, గండేపల్లి ఎస్సై శ్రీ యువి శివ నాగబాబు మరియు పోలీసు సిబ్బంది పాల్గొని సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సైక్లింగ్ వల్ల శారీరక దృఢత్వం పెరగడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని, పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.
ఈ సైకిల్ ర్యాలీ జగ్గంపేట పోలీస్ స్టేషన్ వద్ద ప్రారంభమై, సర్వీస్ రోడ్ మీదుగా జేవియర్ జంక్షన్, జగ్గంపేట మెయిన్ రోడ్, గోకవరం రోడ్డు మీదుగా కొనసాగింది.
ర్యాలీ ద్వారా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ మరియు సైక్లింగ్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.