తెలుగు రాష్ట్రాల్లో ఒంటరి మహిళల సంఖ్య భారీగా పెరుగుదల . ఎస్‌ఆర్‌ఎస్ నివేదికలో కీలక విషయాలు

హైదరాబాద్, నేటి శుభోదయ : తెలుగు రాష్ట్రాల్లో ఒంటరిగా జీవిస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్) స్టాటిస్టికల్ రిపోర్ట్-2024’ స్పష్టం చేసింది. విడాకులు, భాగస్వామిని కోల్పోవడం, వివాహం కాకుండా ఒంటరిగా జీవించడం వంటి కారణాలతో పురుషులతో పోలిస్తే మహిళలే అధిక సంఖ్యలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్లు నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఒంటరిగా జీవిస్తున్న మహిళలు పురుషుల కంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువగా ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సంఖ్య...