సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు:
*గూడూరు సర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్తా*
*ఒక్కొక్కరి ఖాతాలో రూ. 32,500/- జమ*
షాద్నగర్ నియోజకవర్గం నేటి శుభోదయ ప్రతినిధి జూన్ 15
తెలంగాణ ప్రభుత్వం సర్పంచులకు గౌరవ వేతనం విడుదల చేయడంతో సర్పంచులు ఫుల్ ఖుష్ అయ్యారని గూడూరు సర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్తా అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సర్పంచులు ఇక ముందు మరింత ఉత్సాహంతో గ్రామాభివృద్ధి పనుల్లో ఫుల్ జోష్ గా పాల్గొంటారని ఆయన అన్నారు.ఒక్కో సర్పంచ్కు నెలకు 6500/- చొప్పున మే వరకు గౌరవ వేతనాలు అకౌంట్లో వేసినట్లు ఆయన చెప్పారు.ఆరు నెలల తర్వాత తమ చేతికి తొలి వేతనం అందడంతో గూడూరు సర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్తా సంతోషం వ్యక్తం చేశారు.