కోరుకొండ గ్రామంలో పలుచోట్ల భారీ కేక్ కటింగులు.. పుట్టినరోజు సంబరాలు..
కోరుకొండ, నేటి శుభోదయ ప్రతినిధి (ఏ.కె);
జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కోరుకొండ మండల గౌరవ అధ్యక్షులు, ఆద్యాత్మిక వేత్త బదిరెడ్డి దొర 57 వ జన్మదిన వేడుకలు కోరుకొండ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద మొదలుకొని పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో కూటమి నాయకులతో మాజీ సర్పంచులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అభిషేకం చేయించారు. అనంతరం అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి బదిరెడ్డి దొరకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కటకం చలం, కటకం సత్యనారాయణ, కర్రీ వీర గణేష్, నీరుకొండ బాబ్జి, పసుపులేటి శివ, మూసిని శ్రీనివాస్, ఓలేటి సూర్యనారాయణ, సుంకర శ్రీను, కాలచర్ల శ్రీను, ఒంటిపల్లి వాసు, కోసురి శ్రీనివాస్, వాతాడ గోపి, బడగలపాటి శ్రీను, మైలపల్లి సుబ్రహ్మణ్యం, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేశారు. బదిరెడ్డి దొర ప్రజాసేవలో ఇంకా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.