NETI SUBHODAYA
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 12:42 pm Posted by : NETI SHUBHODAYA

ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో ‘జనసేన ట్రేడ్ యూనియన్’ ఘనవిజయం…!

– రాజమండ్రి పేపర్ మిల్ ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో జనసేన ట్రేడ్ యూనియన్ ఘనవిజయం…!- యూనియన్ కు అధ్యక్షులుగా రాజానగరం నియోజకవర్గ బత్తుల బలరామకృష్ణ..!

– కార్మిక నాయకులను, కార్మిక సోదరులను పూలమాలతో సత్కరించి, అభినందించిన ఎమ్మెల్యే ‘బత్తుల’..

రాజమహేంద్రవరం, నేటి శుభోదయ ప్రతినిధి (ఏ.కె); రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో మూడు యూనియన్ల మధ్య చివరి వరకు నువ్వా నేనా అనేటట్టు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో……. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధ్యక్షులుగా ఉన్న ‘జనసేన ట్రేడ్ యూనియన్’ 258 ఓట్లతో మొదటి స్థానం నిలిచి, ఘనవిజయం సాధించింది, వైసిపి అనుబంధ ప్యానల్ (యూనియన్) రెండో స్థానంతో సరిపెట్టుకుంది…

ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో కష్టపడిన కార్మిక నాయకులను, కార్మిక సోదరులను ఎమ్మెల్యే ‘బత్తుల’ పూలమాలతో సత్కరించి, సభ్యులందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనందోత్సవాల మధ్య జరిగిన ఈ విజయోత్సవ వేడుకలో జనసేన పార్టీ అగ్ర నాయకులు వై శ్రీను, అత్తి సత్యనారాయణ, శ్రీమతి ప్రియా సౌజన్య, ఇతర ముఖ్య నాయకులు, కార్మిక నేతలు, కార్మిక సోదరులు పాల్గొన్నారు.