మీడియాలో తనపై అసత్య ప్రచారం జరుగుతుందని, అసలు ఏమీ లేని విషయాన్ని జరిగినట్టుగా కొన్ని టీవీ ఛానళ్ళు అసత్య ప్రచారం చేయటం తగదని తాడేపల్లిగూడెం రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొవ్వూరి నాగేంద్ర రెడ్డి అన్నారు.కొన్ని టీవీ ఛానళ్ల లో తాను దొంగ నోట్లు కేసులో అరెస్టయినట్లుగా అసత్య ప్రచారం జరుగుతుందని,ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. స్థానిక పి అండ్ టి కాలనీలో రెడ్డి సంక్షేమ సంఘం సీనియర్ నాయకుడు మేడపాటి చెల్లారెడ్డి నివాసంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిగూడెం రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా తమ కుటుంబం గురించి తాడేపల్లిగూడెం ప్రజానీకానికి తెలుసని,అత్యంత నిజాయితీగా వ్యవహరించే తమపై ఇలాంటి అసత్య ప్రచారం జరగటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత పొలం అమ్మకం వ్యవహారంలో తాను కాకినాడ వెళ్లానని తెలిపారు. అసలు దీనికి ఏ మాత్రం సంబంధం లేని దొంగ నోట్ల వ్యవహారం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు అన్నారు. కాకినాడ పోలీసు అధికారులు పూర్తి వివరణ ఇచ్చారని అన్నారు. ఎవరో ఇచ్చిన ఫేక్ కాల్ నిమిత్తం పోలీసులు తాము దిగిన లాడ్జికి వచ్చారని, పూర్తి విచారణ అనంతరం ఎలాంటి చట్ట వ్యతిరేక వ్యవహారం జరగలేదని పోలీసులు మీడియాకు తెలియజేశారని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి ప్రాథమిక సమాచారం కాని, ఆధారాలు కానీ లేకుండా రెండు మూడు చానళ్ల లో అసత్య ప్రచారం చేసి తనకు పరువు నష్టం
కలిగించారాని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు మేడపాటి చెల్లారెడ్డి, ద్వారంపూడి వేణుగోపాల్ రెడ్డి, బేతిరెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డి,నల్లిమిల్లి గాంధీ రెడ్డి, నల్లిమిల్లి అంజిరెడ్డి, కర్రీ వరహాలు రెడ్డి, కొవ్వూరి లక్ష్మణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
