ePaper
Sunday, July 26, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ' 'మన ఊరు

రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ‘ ‘మన ఊరు

📰 Generate e-Paper Clip

– ‘పల్లెల అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శకత సుపరిపాలన ధ్యేయంగా…’

కోరుకొండ, నేటి శుభోదయ ప్రతినిధి (ఏ.కె); రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సుపరిపాలనను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ‘మన ఊరు – మన ఎమ్మెల్యే – మన పల్లెబాట..’ నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పలు అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలతో పాటు ప్రజల సమస్యలపై నేరుగా అర్జీల స్వీకరించే కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బలరామకృష్ణ కార్యాలయం వర్గాలు ఒక ప్రకటన విడుదల చేసారు.

 

నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో సచివాలయాల వద్ద ఎమ్మెల్యే చే కార్యక్రమం నిర్వహిస్తారు. గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది. సుపరిపాలన, గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా గ్రామాల పురోగతిని సాధించాలని లక్ష్యంతో శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఈ క్రింది షెడ్యూల్ విధంగా ఆయా గ్రామాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు.

 

ఈ నెల 21 మంగళవారం కోరుకొండ మండలం

ఉదయం 8.30 గం.ల నుండి ఉదయం 10 గం.ల వరకు రాజవరం గ్రామం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ఏర్పాటు చేశారు. అలాగే ఉదయం 10.30 గం.ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు కణుపూరు గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తారు. మధ్యాహ్నం 12.30 గం.ల నుండి మధ్యాహ్నం 2 గం.ల వరకు నర్సాపురం గ్రామంలో కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ జనసేన, తెలుగుదేశం, బిజెపి కుటుంబ సభ్యులు, ఆయా గ్రామ ప్రజలు, పలు సమస్యలపై అర్జీలు అందించేవారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. పల్లెల అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన కోసం…. అందరూ భాగస్వాములు కావాలని మనవి ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!