ePaper
Friday, June 12, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్మహిళలకు 33% రిజర్వేషన్ల విషయమై మాట తప్పిన నారా లోకేష్

మహిళలకు 33% రిజర్వేషన్ల విషయమై మాట తప్పిన నారా లోకేష్

📰 Generate e-Paper Clip

 

• రాజ్యసభ కు ఒక్క మహిళను కూడా ఎంపిక చేయకపోవడం దారుణం

• ఇప్పటికే స్పీకర్ గా ఉన్న అయ్యన్నపాత్రుడి కుమారుడికి రాజ్యసభ స్థానం ఎందుకు?

• నారా లోకేష్ అనాలోచిత నిర్ణయాలు వల్ల భవిష్యత్తులో పార్టీ మనుగడకే ప్రస్నార్థకం

• జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది

—- తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ సంచలన వ్యాఖ్యలు

( నేటి శుభోదయ జూన్ : 08 విశాఖపట్నం జిల్లా చీఫ్ బ్యూరో జగన్ ) విశాఖపట్నం: మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన తెలుగు దేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కేవలం తొమ్మిది రోజుల్లోనే మాట తప్పారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆరోపించారు. ఆదివారం ఉదయం జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆయన మీడియాతో ఇదే విషయమై మాట్లాడుతూ.. రాజ్యసభకు నాలుగు స్థానాలు కేటాయించాల్సి ఉండగా ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించారన్నారు. మిగిలిన మూడు స్థానాలలో తెలుగు దేశం పార్టీకి చెందిన అగ్రవర్ణ వ్యక్తులకే సీట్లు కేటాయించడం దారుణం అని వ్యాఖ్యనించారు. తమకు 33% రిజర్వేషన్ అని లోకేష్ ప్రకటించిన వెంటనే అతని ఫోటోలకు క్షీరాభిషేకాలు చేసిన మహిళలు ఇప్పుడు లోకేష్ వైఖరిపై ఎలా స్పందిస్తారో చూడాలన్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడికి సీటు కేటాయింపు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం మీద చూసినట్లయితే కేవలం లోకేష్ టీమ్ కే చెందిన ముగ్గురే వ్యక్తులకు రాజ్యసభ సీట్లు కేటాయించడం బట్టి పార్టీలో చంద్రబాబు నాయుడు టీమ్ ప్రాబల్యం తగ్గుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నదని పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఉన్న నారా లోకేష్ అనాలోచిత నిర్ణయాలు భవిష్యత్తులో ఆ పార్టీ మనుగడకే ప్రస్నార్థకం చేస్తాయని హెచ్చరించారు. గతంలో తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పతనం కావడానికి లోకేష్ కారణమని ఆరోపించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని.. ఈ నేపథ్యంలో 2029 ఎన్నికలలో పార్టీ ఓటమి ఖాయమని అంచనా వేశారు. తెలుగుదేశం పార్టీని విపత్కర పరిస్థితుల నుంచి కాపాడాలంటే అన్న నందమూరి తారక రామారావు వారసుడు.. జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

అమరావతి మహిళకు సీటు కేటాయించాలి

నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లలో భాగంగా వెంటనే మహిళకు రాజ్యసభ సీటు కేటాయించాలని అది కూడా అమరావతి ప్రాంతానికి చెందిన మహిళకు కేటాయించాలన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఐదు సంవత్సరాల పాటు గత ప్రభుత్వ హయాంలో మహిళలు వీరోచితమైన పోరాటం చేశారన్నారు. ఆ మహిళల పోరాటానికి గుర్తింపు దక్కాలంటే అమరావతి ప్రాంతానికి చెందిన మహిళకు ఖచ్చితంగా రాజ్యసభ సీటును కేటాయించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అదేవిధంగా ఒక స్థానాన్ని తప్పనిసరిగా బీసీ అభ్యర్థులకు కేటాయించాలని బి.వి.రామ్ డిమాండ్ చేశారు.

వంగవీటి రాధాను విస్మరించారా?

కాపు కుల సింహం వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాను విస్మరించారా? అని బి.వి.రామ్ ప్రశ్నించారు. వంగవీటి రాధాకు తగిన రాజకీయ ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన టీడీపీ ఇప్పుడు రాజ్యసీట్ల కేటాయింపులో మొండి చేయి చూపిందని రామ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సానా సతీష్ కు కేటాయించిన రాజ్యసభ స్థానాన్ని వంగవీటి రాధాకు ఇవ్వాలని తెలుగు శక్తి డిమాండ్ చేస్తోందన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!