‘– సొసైటీ చైర్ పర్సన్ నాతిఫామ్ దొరబాబు వెల్లడి.
కోరుకొండ, నేటి శుభోదయ ప్రతినిధి (ఏ.కె);రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కానవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తానని సొసైటీ చైర్‌పర్సన్ నాతిఫామ్ దొరబాబు తెలిపారు. సహకార సంఘం ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణరూపొందిస్తున్నామని, సొసైటీని ఆర్థికంగా బలోపేతం చేసి ఆదర్శ సహకార సంఘంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. గురువారం సొసైటీ అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యాచరణ ప్రణాళిక వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు 16 కోట్ల నష్టాల్లో ఉన్న సొసైటీ ని నూతన అధ్యక్షునిగా గత ఆగస్టులో బాధ్యతలు స్వీకరించి నట్లు తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్నసమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని దొరబాబు చెప్పారు. గతంలో తీసుకున్న వ్యవసాయ రుణాలను పలువురు ఇంకా కట్టకుండా మొండి బకాయిలుగా ఉన్నాయని, వాటిని తాను పదవిని అధిరోహించిన ఎనిమిది నెలల కాలంలోనే సుమారు కోటి 35 లక్షల రూపాయల మొండి బకాయాలను రికవరీ చేయడం జరిగిందన్నారు. మా రాజకీయ గురువు, మా దేవుడు, మా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సహాయ సహకారాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ రుణాల మంజూరు, ఎరువులు, విత్తనాల సరఫరా, పంటల కొనుగోలు వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గతంలో జరిగినఅభివృద్ధికార్యక్రమాలను కొనసాగించడంతో పాటు, కొత్త ప్రణాళికలను కూడా అమలు చేస్తామని తెలిపారు. సొసైటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి, కార్యాలయ సేవల ఆధునీకరణ,డిజిటల్, సేవల విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుతెలిపారు. సొసైటీ పరిధిలో ఎరువులు పురుగు రైతులందరకు అందే విధంగాకృషిచేస్తున్ననన్నారు. రైతులభాగస్వామ్యంతో సహకార సంఘాన్నిమరింత బలోపేతం చేయడమే తమ సంకల్పమని పేర్కొన్నారు.

రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అలాగే సహకార సంఘం ప్రజల నమ్మకాన్ని మరింత పెంచేందుకు ప్రతి నిర్ణయాన్ని సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అమలు చేస్తామని తెలిపారు. రైతుల అభ్యున్నతి, గ్రామీణాభివృద్ధి రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని,అందుకే రైతుల సంక్షేమమే తన కార్యాచరణకు కేంద్రబిందువుగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు, సభ్యులు మాట్లాడుతూ నూతన చైర్‌పర్సన్ దొరబాబు నాయకత్వంలో కానవరం పీఏసీఎస్ మరింత అభివృద్ధి చెందుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రైతులకు మరింత చేరువయ్యే విధంగా సేవలు అందించాలని కోరగా, అందరి సహకారంతో సొసైటీని జిల్లాలోనే ఆదర్శ సహకార సంఘంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని నాతిబం దొరబాబు హామీ ఇచ్చారు.
